మొన్నామధ్య విశాల్, రీసెంట్‌గా అమితాబ్ బచ్చన్, ఇప్పుడు అక్షయ్‌కుమార్. ఇంతకీ ఏంటి ఈ లిస్టు అని అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నాం. రీసెంట్ టైమ్స్ లో షూటింగ్‌లో గాయపడ్డ హీరోల పేర్లు ఇవి. తాజాగా అక్షయ్‌కుమార్ షూటింగ్‌లో గాయపడ్డారు. బడే మియా చోటే మియా సెట్స్ లో ఆయనకు ప్రమాదం జరిగింది. అక్షయ్‌కుమార్, టైగర్ ష్రాఫ్ హీరోలుగా నటిస్తున్న సినిమా బడే మియా చోటే మియా. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం స్కాట్లండ్‌లో జరుగుతోంది. అక్కడ యాక్షన్ ఎపిసోడ్స్ నిచిత్రీకరిస్తున్నారు. ఈ సమయంలో జరిగిన ప్రమాదంలోనే అక్షయ్ గాయపడ్డారు. అలీ అబ్బాస్ జాఫర్ తెరకెక్కిస్తున్న సినిమా ఇది.
అక్షయ్ యాక్షన్ సన్నివేశాల్లో డూప్‌ని అంగీకరించరు. ఎలాంటి రిస్కీ షాట్స్ అయినా సరే, తానే చేయాలనుకుంటారు. ఈ నేపథ్యంలోనే రిస్కీ స్టంట్స్ చేశారు ఆయన. అక్షయ్, టైగర్ ఒకరితో ఒకరు తలపడే సన్నివేశంలోనే ఈ ప్రమాదం జరిగిందట. ఆల్రెడీ అక్షయ్‌కి మోకాలి సమస్య ఉంది. గాయాలైనవెంటనే ఆసుపత్రికి వెళ్లిన అక్షయ్, అక్కడి నుంచే అటే షూటింగ్ స్పాట్‌కి చేరుకున్నారట. తను యాక్షన్ పార్ట్ పెర్ఫార్మ్ చేయలేకపోయినా, తన క్లోజులు తీసుకోమని డైరక్టర్‌కి చెప్పారట. వీలైనంత వరకు షూటింగ్ ఆలస్యం కాకుండా చూసుకోమని అన్నారట. నొప్పిని భరించడానికి సిద్ధంగా ఉన్నానుగానీ, నా వల్ల షూటింగ్ డేస్ పెరగడం నాకిష్టం లేదు. అనుకున్న తేదీల్లో షూటింగ్ పూర్తి చేసుకుని ఇండియా వెళ్లిపోదామని మేకర్స్ తో చెప్పారట అక్షయ్‌కుమార్. సీనియర్ల నుంచి ఇలాంటి సందర్భాల్లో చాలా నేర్చుకోవచ్చని అంటున్నారు టైగర్ ష్రాఫ్.
అక్షయ్‌కుమార్ సెట్లో చూపించే డెడికేషన్ తనలో స్ఫూర్తి నింపుతోందని చెబుతున్నారు టైగర్. అక్షయ్ సరసన ఈ చిత్రంలో సోనాక్షి సిన్హా నటిస్తున్నారు. మానుషి చిల్లర్, ఆలయా ఎఫ్, పృథ్విరాజ్ సుకుమారన్ ఈ సినిమాలో కీ రోల్స్ పోషిస్తున్నారు. అలీ అబ్బాస్ సోషల్ మీడియాలో షేర్ చేసి యాక్షన్ ఎపిసోడ్ స్టిల్ వైరల్ అవుతోంది. రియల్ లొకేషన్లలో రియల్ స్టంట్స్ షూట్ చేస్తుంటే, ఆ ఆనందమే ఇంకో రకంగా ఉంటుందంటూ పిక్ షేర్ చేశారు డైరక్టర్.